Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవిరే ఆయువు - కరోనా నియంత్రణలో ఆవిరిపట్టడమే కీలకం

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (08:34 IST)
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అయితే వంటింటి చిట్కాలే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనగలవని, అదే దివ్య ఔషధమని గుర్తించారు.

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో ఆవిరి పట్టడాన్ని మించిన ఔషధం మరొకటి లేదని వైద్యులు కూడా నిర్ధారించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు, లేని వారు కూడా ప్రతిరోజు ఆవిరి పట్టుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆవిరి చికిత్స (స్టీమ్‌ థెరపీ) ప్రధాన ఔషధంగా పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
 
స్టీమ్ థెరపీకి(ఆవిరి పట్టడం)క్రేజ్‌
వైరస్‌ సోకి లక్షణాలున్న వారితోపాటు, లక్షణాలు లేనివారు, ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ప్రస్తుతం ఆవిరి మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకినవారిలో లేదా సాధారణ ఫ్లూ సోకినవారిలో ముందుగా శ్వాసవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు గుర్తించారు.

దీన్ని అదుపులో పెట్టేందుకు ఆవిరి మంచి ఉపశమనమని ఆయుర్వేదంతోపాటు అల్లోపతి వైద్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో దీనిపై పెద్ద మొత్తంలో నమ్మకం ఉండటంతో ప్రస్తుతం ప్రతి ఇంటా ఆవిరి పడుతున్నారు.
 
ప్రతి రోజూ కనీసం రెండు లేదా మూడుసార్లు 5 నుంచి 15 నిమిషాలపాటు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని తేల్చారు. కొంతమంది వేడి నీటిలో మందుబిళ్లలు, అల్లం, విక్స్, అమృతాంజనం, జండూబామ్, పసుపు, జిందాతిలిస్మాత్ లాంటివి కలిపి ఆవిరి పట్టుకుంటున్నారు. 
 
ఆవిరి పీల్చడం ద్వారా రక్తనాళాలు వ్యాకోచించి వాటి పనితీరు మెరుగుపడుతుందని, శ్వాసక్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ఫెక్షన్ తొలగిపోయి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
 
ఆవిరి పట్టడంతో పాటు మందులు వాడితేనే మరింత ప్రయోజనం 
కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్‌ వెళ్లకుండా అడ్డుపడంవల్ల ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. పరిస్థితి విషమించి న్యూమోనియాకు దారి తీస్తోంది. ఇలాంటి వారికి వెంటనే ఆక్సిజన్‌ అందించాలి.

పరిస్థితి విషమించినట్టయితే వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోంది. కరోనా సోకిన వారు మొద ట నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. 
 
ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తులు, రక్తనాళాల పైభాగంలో చేరిన మ్యూకస్‌ కొంతమేర తొలగిపోతుంది. గొంతులో ఇబ్బంది ఉన్నా ఉపశమనం కలుగుతుంది. అందుకే కరోనా వైరస్ బారినపడిన వైద్యులు సూచించిన మందులు వాడుతూనే ఆవిరి పట్టినపుడే ప్రయోజనం ఉంటుందని.. మందులు వాడకుండా కేవలం ఆవిరి పట్టినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు.
 
ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నవారే అధికం 
రోజూ మూడుసార్లు 15 నిమిషాలకు తక్కువ కాకుండా ఆవిరిపట్టిన వారిలో ఆక్సిజన్‌ శాతం చాలా మెరుగుపడుతున్నట్లు వైద్యుల పరిశీలన తేలింది. ఔషధాలు వాడుతూ ఆవిరి పట్టిన కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

చాలా మంది కరోనా బాధితులు ఇంట్లోనే ఉంటూ డాక్టర్ల సూచనలు పాటిస్తూ కరోనాను జయిస్తున్నారు. కాబట్టి కరోనా వచ్చిన వారితోపాటు లక్షణాలు ఉన్నవారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటే.. కరోనా లేని వారు కూడా ఆవిరి పట్టుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments