కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత్‌లో ఆవిరి పట్టడం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులను ప్రజలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని సెవెన్ హిల్స్ దవాఖాన వైద్య నిపుణులు ఓ శుభవార్త చెప్పారు.
ఈ వైరస్‌కు ఆవిరి పట్టడం దివ్య ఔషధంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఇలా నిత్యం చేయడం వల్ల కరోనా వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. తాము చేసిన పరిశోధనలో ఆవిరి పట్టడం మంచి ఫలితాలను ఇచ్చినట్లు వారు చెబుతున్నారు.
వారి పరిశోధనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆవిరి పట్టడం వల్ల ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులు ఏడు రోజుల్లో, లక్షణాలున్న వారు ఏడు నుంచి 10 రోజుల్లో కోలుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. డాక్టర్ దిలీప్ పవార్ ఆధ్వర్యంలో మే, జూన్ నెలల్లో కరోనా సోకిన వారిపై ఈ అధ్యయనం చేశారు.
ఆవిరిలో 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, దీనివల్ల ఊపిరితిత్తుల్లో భారం తగ్గుతుందని, 50 నుంచి 60 డిగ్రీల ఉష్ణోగ్రత తగలగానే వైరస్ చనిపోతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. సాధారణ, మధ్యస్థ, లక్షణాలున్న వారు, వైరస్ సోకి ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులను రెండు బృందాలుగా విభజించి అధ్యయనం చేశారు.
మొదటి గ్రూపులో ఉన్నవారు రోజుకు రెండుసార్లు 5 నిమిషాల పాటు ఆవిరిపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఇక రెండో గ్రూపులో ఉన్నవారు ప్రతీ 3 గంటలకు ఒకసారి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టారు.
ఇలా 14 రోజుల నుంచి 2 నెలల పాటు పరిశీలిస్తే వీరిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, రెండు గ్రూపుల్లో ఉన్నవారిని పరిశీలిస్తే..స్వల్ప లక్షణాలున్న వారు 7 రోజుల్లో కోలుకుంటే.. మధ్యస్థ లక్షణాలున్న వారు 7 నుంచి 10 రోజుల్లో కోలుకున్నారని వైద్య నిపుణులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యల పరిష్కారానికి ఆవిరి పట్టడం దోహదపడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.