Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతే.. అధైర్యం వద్దు : మంత్రి కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (12:28 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని, అందువల్ల ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సికింద్రాబాద్‌లో గృహ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో అమరావతి రైతులు, మహిళలు అక్కడకు వచ్చి ఓ వినతి పత్రం సమర్పించారు. 
 
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని.. దానిని అక్కడే కొనసాగించాలని, తమను కాపాడాలని కిషన్‌ రెడ్డి కాళ్లుపట్టుకుని ప్రాధేయపడ్డారు. దీంతో భావోద్వేగానికిలోనైన మంత్రి కిషన్ రెడ్డి... పైవిధంగా భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం చేస్తానన్నారు. దీంతో రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విభిన్న ప్రకటనల వల్లే ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. 'రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చినప్పుడు వారికి ధైర్యం చెప్పి, అండగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపై ఉంటుంది. రైతుల నుంచి ఇప్పటికే భూముల సేకరణ జరిగింది. పార్టీలు, ప్రభుత్వం కలిసి చర్చించుకోవాలి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం మంచిది కాదు' అని హితవుపలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments