Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.. రాజధానిపై ఏమన్నారో తెలుసా?

Advertiesment
పవన్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.. రాజధానిపై ఏమన్నారో తెలుసా?
, శనివారం, 4 జనవరి 2020 (15:56 IST)
రాజధానిపై ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు షాకిచ్చే కామెంట్లు చేశారు.. ఆ పార్టీ ఎమ్మెల్యే. జ‌న‌సేన‌కు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఒక్క‌రే ఎమ్మెల్యే. అయితే అతను చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్రంలోనూ పార్టీలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. 
 
ఏపీకి మూడు రాజ‌దానుల అంశంపై ప‌వ‌న్ కుటుంబంలోనే రెండు అభిప్రాయాలున్నాయని రాపాక గుర్తు చేశారు. చిరంజీవి మూడు రాజ‌ధానుల అంశాన్ని స‌మ‌ర్థించార‌ని ఎమ్మెల్యే రాపాక గుర్తు చేసారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ నిర్ణయంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 
 
తనకు పార్టీ నిర్ణయం కంటే తనను గెలిపించిన ప్రజలే ముఖ్యమని రాపాక వెల్లడించారు. పవన్ సైతం మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదని. కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని కోరుతున్నారని తెలిపారు. రాజధానులతో సామాన్యులకు పని ఉండదని మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.
 
మరోవైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేయాలంటూ రైతులు ఆందోళ‌న‌లు చేస్త‌న్నారు. అలాగే కర్నూలును రాజధాని చేయాలని.. రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అది కాని పక్షంలో తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. కాదు కూడ‌ద‌నుకుంటే చిత్తూరు జిల్లాను కర్ణాటక లేదా తమిళనాడులో కలపాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో అదే చేస్తాం.. ఆర్మీ కొత్త చీఫ్‌ ముకుంద్‌