Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: కృష్ణా జిల్లా కలెక్టరు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:03 IST)
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ అన్నారు.

స్థానిక పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో గుడివాడ డివిజన్ లో రెండవ విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల పై యంపీడీవోలు, తాహశీల్థార్లు, మండల ప్రత్యేకాధికారులు, పోలీసు అధికారులతో కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ జాయింట్ కలెక్టరు మాధవీలతో కలసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ డివిజన్ లో మొదట విడతలో 234 పంచాయితీల్లో జరిగిన ఎన్నికలను శాంతియుతమైన వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు. 86.6 శాతం ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారన్నారు.

ఈ నెల 13 వ తేదీన  రెండవ విడతలో నిర్వహించే గుడివాడ డివిజన్ లో 211 గ్రామ పంచాయితీల్లో 1968 ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబందించి తాహశీల్థార్లు యంపీడీవోలు సమన్వయంతో పచేస్తూ స్టేజ్-1,2 ప్రిసైడిగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుకు శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేశారన్నారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ లోకేషన్లలో మైక్రో అబ్జర్లును నియమిస్తున్నామన్నారు. అలాగే వీడియోగ్రపీ, వెబ్ క్యాస్టింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యంపీడీవోలు తమ మండల పరిధిలో గల అన్ని పోలింగ్ కేంద్రాలను, కౌంటింగ్ కేంద్రాల్లో  పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు  కల్పించాలన్నారు.

కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఒకే  గదిలో  రెండు పోలింగ్ కేంద్రాలు వుంటే ఓటర్లుకు అర్థమయ్యే విదంగా బారిగేడ్లను ఏర్పాటు చెయ్యాలన్నారు. విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పేపరును ముందురోజే ఇచ్చి మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేసే విధంగా చర్యలు చేపట్టారన్నారు.

ఎన్నికల సామాగ్రి పంపిణీ రోజు బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బ్యాక్సులు ట్రాన్స్ ఫరెంట్ గా  పీఓ, ఏపీఓలకు అందజేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ స్విష్టం ఏర్పాటు చేయాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ పంపిణీ సమయంలో డ్యూటీ వేసిన వారు ఎవరైనా రాకుంటే రిజర్వులో ఉన్న సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు.

ఆ మండలంలో ఓటరుగా ఉన్న వారిని మాత్రమే పోలింగ్ ఏజంట్ గా అనుమతి ఇవ్వాలన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ ప్రక్రియ ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ఉంటుదన్నారు.   పోస్టల్ బ్యాలెంట్ ను యంపీడీవోలు ముందుగానే ఆయా కౌంటింగ్ కేంద్రాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

కౌంటింగా ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఆరిటర్నింగ్ అధికారిదే పైనల్ నిర్ణయం అవుతుందని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments