ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అనుసంధానికి పచ్చజెండా ఊపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. 
 
ఆధార్ నంబరుతో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసే అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాంకేతిక నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ రెండు గుర్తింపు కార్డులను అనుసంధానం చేయడం వల్ల దొంగ ఓట్లను నమోదు చేయడానికి వీలుండదు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానమైతేనే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దీనివల్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటిని జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి వీలుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments