Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకో తెలుసా?

వరుణ్
ఆదివారం, 24 మార్చి 2024 (12:34 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారంటూ పేర్కొంటూ ఆమెకు నోటీసులు పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 
 
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి అప్పట్లో పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను కలిసి వారిని ఓదార్చుతూ మృతుల కుటుంబాలకు ఆమె రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. దీన్ని వైకాపా నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ నోటీసులు జారీచేసింది.
 
డబ్బుల కోసం ఏమైనా రాస్తారా? దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు లేరా? నటి మీనా ప్రశ్న
 
సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై మండిపడ్డారు. డబ్బు కోసం ఏమైనా, ఎలాంటి వార్తలనైనా రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్త రాసేముందు నిజా నిజాలు తెలుసుకోరా అని ఆమె ప్రశ్నించారు. తాను ఒంటరిగానే ఉంటానని, దేశంలో ఒంటరిగా నివశిస్తున్న మహిళలు లేరా అని ఆమె సూటిగా అడిగారు. తన తల్లిదండ్రులు, కుమార్తె భవిష్యత్ కోసమే తన ఆలోచనలన్నీ ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 
 
గత 1990లో చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన మీనా... వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే, ఆ మధ్య తన భర్త సాగర్‌ను కోల్పోయింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. వరుస షూటింగులతో బిజీగా గడుపుతుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు. ఈ విషయం వారికి ఎవరు చెప్పారో తనకు తెలియదు. డబ్బు కోసం ఎలాంటి వార్తలైనా రాస్తారా అని ప్రశ్నించారు. మీడియా నానాటికీ దిగజారిపోతుందన్నారు. ఒక వార్త రాసే ముందు వాస్తవాలు తెలుసుకుని రాయాలని ఆమె హితవు పలికారు. తాను ఒంటరిగానే ఉంటానని, దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహళలు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు, తన కుమార్తె భవిష్యత్ కోసం ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తాను భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇపుడే ఎలా చెబుతానని ప్రశ్నించింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. ప్రస్తుతానికి రెండో పెళ్ళి గురించి ఆలోచన లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments