Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌‍సభ ఎన్నికలు : ఆ పది స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీరేనా..?

tdplogo

PNR

, గురువారం, 21 మార్చి 2024 (14:23 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పది స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. మొత్తం 25 స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా భాగస్వామి పార్టీలైన జనసేన రెండు, బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే, టీడీపీ పోటీ చేసే 17 స్థానాల్లో పదింటిలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో శ్రీకాకుళం - కె. రామ్మోహన్ నాయుడు, విశాఖ - ఎం. భరత్, అమలాపురం - గంటి హరీష్, విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని), గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి/రాఘవరెడ్డి, నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్, అనంతపురం - బీకే పార్థసారధి, నంద్యాల- బైరెడ్డి శబరిలు ఉన్నారు. అయితే, వీరి పేర్లను చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించాల్సివుంది. మరోవైపు, మిగిలిన ఏడు స్థానాలకు కూడా అభ్యర్థులను నేడో రేపో ఖరారు చేసి వెల్లడించనున్నారు. 
 
మరోవైపు, టీడీపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. విజయవాడలో ఏ-వన్ కన్వెన్షన్ సెంటర్​లో జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌, పొలిటికల్‌ మేనేజర్‌, మీడియా మేనేజర్‌, సోషల్‌ మీడియా మేనేజర్లను వర్క్‌షాప్‌కు పిలిచినట్లు సమాచారం. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సి వ్యూహాలపై వారికి అవగాహం కల్పించనున్నారు.
 
ఇదిలావుంటే, ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 26వ తేదీ నుంచి 'ప్రజాగళం' పేరుతో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచారయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో 10 వేల మందితో 'ప్రజాగళం' సభ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు మరో నియోజకవర్గంలో, రాత్రి ఏడున్నరకు ఇంకో నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి సుమారు 20 రోజులపాటు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly Election 2024 : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!!