Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, కూతుర్ని సంతలో వేలానికి పెట్టిన భర్త... ఎక్కడ?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (14:37 IST)
ఆర్థిక ఇబ్బందులు భరించలేక పోయింది ఆ కుటుంబం. చాలీచాలని జీతంతో జీవితాన్ని సాగించలేకపోయారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఇక జీవితం మారదన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో భర్తను ఒప్పించి వేలం పెట్టమని ప్రాధేయపడ్డారు భార్య, కూతురు. సభ్య సమాజం నివ్వెరపోయేలా జరిగిన సంఘటన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరులో జరిగింది. 
 
వెంకటేష్‌, పద్మావతిలది అనంతపురం జిల్లా. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో బంధువులుంటే ఇక్కడకు వలస వచ్చారు. వీరికి 18 సంవత్సరాల కుమార్తె శిరీష ఉంది. వెంకటేష్‌ స్థానికంగా ఉన్న కోళ్ల ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేసేవాడు. వచ్చే జీతం ఇంటికి సరిపోయేది కాదు. ఆర్థిక ఇబ్బందులతో స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. ఆరు నెలల పాటు చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. దీంతో ఇంట్లో భార్య పద్మావతి నగలను అమ్మి కాస్త వడ్డీలను చెల్లించాడు.
 
తన నగలు అమ్మడంతో పద్మావతి ఆగ్రహంతో ఊగిపోయింది. అప్పులు బాధ భరించడం కన్నా చావడం మంచిదంది. అయితే అందుకు ఒప్పుకోలేదు వెంకటేష్‌. నన్ను, నీ కూతుర్ని వేలం పెట్టు ఎవరో ఒకరు కొంటారు. ఆ డబ్బుతో అప్పులు కట్టేయ్. మనకు ఈ బాధలు వద్దంటూ బోరున విలపించింది. దీంతో వెంకటేష్‌ మరో మాట మాట్లాడకుండా జి.డి. నెల్లూరులో సంతలో ఇద్దరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. కొంతమంది రైతులు అటుగా వెళుతుంటే భార్య, కూతుర్ని అమ్మేస్తున్నాను రేటు మాట్లాడమన్నాడు. 
 
దీంతో ఆశ్చర్యపోయిన రైతులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి. అలాగని ఇలాంటి పనులు చేయడం తప్పంటూ వెంకటేష్‌‌ను హెచ్చరించి పంపేశారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments