ఏపీలో ఈ నెల 11 నుంచి దసరా సెలవులు..

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (09:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దసరా సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఏపీలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్రకటించారు. 
 
ఇదిలావుంటే.. గతంలో పాఠశాలలకు దసరా సెలవులను ఆరు రోజులుగా ప్రభుత్వం ప్రకటించగా.. 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. దీంతో అక్టోబర్ 8వ తేదీ వరకే పాఠశాలలు పని చేయనున్నాయి. అటు 17వ తేదీ ఆదివారం కావడంతో స్కూల్స్ 18న పునఃప్రారంభంకానున్నాయి. మొత్తం 9వ తేదీ నుంచి 17 వరకు(9 రోజులు) పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి.
 
అదేవిధంగా తెలంగాణలో బుధవారం నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకుంటాయని వెల్లడించింది. అలాగే ఈ నెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు ఇంటర్‌ కాలేజీలకు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raja: క్షమాపణ, రాణి మారియా త్యాగం నేపథ్యంగా ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments