Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్‌ల పంపిణీ : మంత్రి తానేటి వనిత

Advertiesment
Taneti Vanita
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:22 IST)
స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదరికంతో బాధపడుతున్న కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్‌ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరమని ఏపీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఏపీలో స్వేచ్ఛ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో జరుగుతుందన్నారు. రుతుక్రమం సమయంలో పిల్లలకు హర్మొనల్‌ మార్పుల వల్ల చాలా సమస్యలు వస్తుంటాయన్నారు.
 
ఆ సమయంలో పిల్లలకు వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం, ఆడపిల్లలను తల్లి గైడ్‌ చేస్తుంది. ఈ స్వేచ్చ కార్యక్రమం వల్ల పిల్లల ఆరోగ్యంపై తల్లి ఏ విధంగా శ్రద్ద తీసుకుంటుందో మీరు తల్లికంటే ఎక్కువగా వారి మేనమామగా ఆలోచించి దీని అవసరాన్ని గుర్తించారు. శానిటరీ న్యాప్కిన్స్‌ వాడకపోవడం వల్ల అనేక ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి అనేకమంది పిల్లలు తమ సమస్యలను ఎవరితో చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవుతుంటారు. 
 
ఇది వారి చదువుల మీద ఎఫెక్ట్‌ చూపుతుంది. గతంలో స్కూల్స్‌లో టాయిలెట్స్‌ కూడా ఉండేవి కాదు, ఉన్నా అరకొరగా ఉండేవి, కానీ మీరు నాడు నేడు కింద టాయిలెట్స్‌ విత్‌ రన్నింగ్‌ వాటర్‌తో ఏర్పాటుచేశారు, దీంతో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. 10 లక్షల మంది విద్యార్ధులకు మనం న్యాప్కిన్స్‌ ఇస్తున్నాం, ప్రతీ స్కూల్‌లో నోడల్‌ ఆఫీసర్‌ దీనిని పర్యవేక్షిస్తారు. 
 
దీంతోపాటు వైఎస్‌ఆర్‌ చేయూత స్టోర్స్‌ ద్వారా కూడా న్యాప్కిన్స్‌ అందుబాటులో ఉంచుతున్నాం. మహిళలందరికీ కూడా తక్కువ ధరకే బ్రాండెడ్‌ న్యాప్కిన్స్‌ అందజేస్తున్నాం. ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబిల్, నైన్‌ అనే కంపెనీల నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్‌ నెలలకు సరిపడా స్టాక్‌ ఇప్పటికే స్కూల్స్‌కు పంపడం జరిగింది. 
 
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతూ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పేరుతో ఏడాదికి రూ. 1,800 కోట్లు కేటాయిస్తున్నారు, గతంలో నామామాత్రపు కేటాయింపులు జరిగేవి. ఇది చాలా గొప్ప విషయం. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు, దీంతోపాటు మిడ్‌ డే మీల్‌ కూడా చక్కగా ఇస్తున్నారు. దిశ యాప్‌ కూడా తీసుకొచ్చి మహిళలలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. 
 
విద్యాశాఖలో మీరు వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి మీ ద్వారా అందుతున్నాయి. అన్ని విధాలుగా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై మీరు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద పట్ల వారి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టుల కార్లకు టోల్ ఫీజు రద్దు చేయాలి