పాముతో చెలగాటమాడిన తాగుబోతు... తర్వాత ఏమైంది?

Webdunia
బుధవారం, 1 మే 2019 (12:17 IST)
పీకలవరకు మద్యం సేవించిన మద్యంబాబులు చేసే చేష్టలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఈ చర్యలు కొందరికి నవ్వు తెప్పిస్తే.. మరికొందరికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంటాయి. అటువంటి ప్రయత్నాన్నే చేశాడు ఓ తాగుబోతు. పీకల వరకు మద్యం సేవించిన గోవిందరాజు అనే తాగుబోతు కాలనీని ఇంటికి వస్తున్నాడు. 
 
ఆ సమయంలో ఆ కాలనీలోని ఓ ఇంటిలో పాము ఉన్నట్టు స్థానికులంతా హడావుడి చేస్తున్నారు. ఈ మాటలు ఈ తాగుబోతు చెవిలో పడ్డాయి. ఇంకేముంది.. తన ప్రతాపాన్ని పాముపై చూపించేందుకు ప్రయత్నించాడు. 
 
అప్పటికే మత్తులో ఉన్న ఆయన, దాన్ని తాను పట్టుకుంటానని చెప్పి ముందుకెళ్లాడు. పాములు పట్టడంలో ఏ మాత్రమూ అనుభవం లేని గోవిందరాజు, పామును పట్టే క్రమంలో దాని కాటుకు గురయ్యాడు. దీంతో ఆయన ఆస్వస్థతకు పాలుకాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గోవిందరాజుకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించగా, ఆయన చేసిన పనికి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదని స్థానికులు వ్యాఖ్యానించారు. 
 
ఈ ఘటన కర్ణాటకలోని నేలమంగళ పట్టణంలో జరిగింది. ఈ తాగుబోతు పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్యా పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments