ప్రభుత్వ వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్‌కి వెళ్తున్నాడు.
అయితే కోడికి టిక్కెట్ తీయలేదని సదరు వ్యక్తికి కర్ణాటక ఆర్టీసీ రూ.500 ఫైన్ వేసింది. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది.
ఈ విషయం తెలియని ఆ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. కేవలం తనకు మాత్రం టిక్కెట్ తీసుకున్నాడు గానీ, కోళ్ల సంగతి చెప్పలేదు. అనుకోకుండా ఆర్టీసీ చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి వచ్చారు.
ఆ వ్యక్తి తాను తీసుకున్న టిక్కెట్‌ను మాత్రమే చూపాడు, అయితే కోళ్ల సంగతి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. దాంతో అతడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు ఫైన్ విధించారు. దాంతో ఆ వ్యక్తి ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.