Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొకరి మహిళ వీడియో చూసి భార్యే అలా చేసిందని చంపేశాడు, ఆ తర్వాత?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (19:01 IST)
పచ్చటి కాపురం. ఇరవై ఏళ్ళ పాటు సాగింది. అనుమానం పెనుభూతమైంది. ఆ కుటుంబంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు చివరకు భార్య ప్రాణాలను బలిగొంది. తాను ఎవరితోను అక్రమ సంబంధం పెట్టుకోలేదని భర్తతో వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు భర్త హంతకుడయ్యాడు. అతడి చేతిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. పిల్లలు అనాథలుగా మారిపోయారు. 
 
కడప జిల్లా చిన్నాయపల్లెకి చెందిన పుల్లారెడ్డి, బి.మఠం గ్రామానికి చెందిన నారాయణమ్మతో 30 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు. అయితే పుల్లారెడ్డికి అనుమానం ఎక్కువ. 
 
నిరంతరం భార్యపై అనుమానం పెట్టుకుంటూ ఉండేవారు. గత సంవత్సరంగా ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. నారాయణమ్మ తన స్నేహితురాళ్ళను కలిసేందుకు తరచూ వారి ఇళ్ళకు వెళుతుండేది. ఇలా వద్దని వారించేవాడు భర్త.
 
తనకు ఇంట్లో బోర్ కొడుతోందని.. స్నేహితురాళ్ళని కలిస్తే తప్పేంటని ప్రశ్నించేది. అయితే పుల్లారెడ్డి మాత్రం ఈ సాకుతో ఎవరెవరినో తన భార్య కలుస్తోందని అనుమానించేవాడు. దీంతో రెండురోజుల క్రితం భార్య నిద్రిస్తున్న సమయంలో తల నరికాడు. ఆ తరువాత గోనె సంచిలో మృతదేహాన్ని కట్టేసి ఎవరికీ అనుమానం రాకుండా తెలుగు కాల్వలో పడేశాడు. 
 
తల్లి కనిపించలేదని కుమారుడు పోలీసు స్టేషన్‌కు వెళితే అసలు విషయం బయటపడింది. తన భార్య వేరొకరితో కలిసి ఉందని అపోహపడుతూ కొన్ని వీడియోలను చూశాడు పుల్లారెడ్డి. దీంతో ఆమెను చంపేసినట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments