కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో పట్టణంలోని రామలక్ష్మీ కొట్టాలలోని రెండో వీధిలో నివాసముంటున్నారు ఆటో డ్రైవర్ రాజా, అతని భార్య లావణ్య. రాజాకు ఒక సంఘం హక్కుల సాధన సమితి అధ్యక్షుడితో పరిచయం ఉంది. ఆ పరిచయంతో తరచూ ఇంటికి వెళ్ళేవాడు.
ఈ క్రమంలో లావణ్యతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త రెండు నెలలుగా అక్రమ సంబంధానికి దారితీసింది. తనకు చాలామంది రాజకీయ నాయకులు తెలుసునని.. బాగా డబ్బులు కూడా ఉన్నాయంటూ ఆమెను మోసగించాడు.
భర్త ఆటో నడుపుతుండటం.. చాలీ చాలని డబ్బులతో ఇబ్బందిపడటం లావణ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈజీగా ఆ నేతకు వేసిన వలలో పడిపోయింది. విషయం భర్తకు తెలిసి తన ఇంటికి రావద్దని నేతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చెప్పాడు. అయినా వినకుండా తరచూ ఇంటికి వచ్చేవాడు.
నిన్న మధ్యాహ్నం తాను ఆటో నడిపేందుకు బయటకు వెళ్ళగా ఆ నేత ఇంటికి వచ్చాడు. తన భార్య, అతను ఇంట్లో ఉండటం చూసి బయట తలుపులు మూసి పోలీసులను తీసుకొచ్చాడు. మొత్తం వ్యవహారాన్ని చూపించాడు. కానీ కోర్టు గతంలో మహిళలు తమకు ఇష్టం వచ్చిన విధంగా ఉండొచ్చని చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశాడు ఆ నేత. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.