Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నాయుడు ఆరోగ్యం ఎలా వుంది... జీజీహెచ్ వైద్యులు ఏమంటున్నారు?

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (13:40 IST)
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా, అరెస్టుకు ముందు అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకునివున్నారు. అరెస్టు తర్వాత ఆయనను ఏసీబీ అధికారులు సుధీర్ఘ ప్రయాణం చేయించారు. దీంతో ఆయన గాయం తిరిగి పచ్చిగా మారింది. 
 
దీనిపై గుంటూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ స్పందించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు గతంలో జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందన్నారు. ఈ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు. 
 
పైగా, ఆయనకు అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామన్నారు. ఆయనకైన గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చన్నారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామన్నారు. అలాగే ఆయనకు షుగర్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.
 
మెరుగైన వైద్యం అందించండి... సీఎం జగన్  
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు చేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గుంటూరు ఆసుపత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
 
ఈ పరిస్థితుల్లో సీఎం జగన్... అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ఆరా తీశారు. అచ్చెన్న ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్న కోరుకున్న చోట ఆయనకు వైద్య సహాయం అందించాలని ఏసీబీ అధికారులను జగన్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments