Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎఫెక్ట్.. 18.5 లక్షల అబార్షన్‌లు.. అదీ గైనకాలజిస్టులు లేకుండానే?

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (13:39 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు మాత్రమే వైద్యులకు చికిత్స ఇచ్చేందుకు  సమయం సరిపోతుందని.. ఫలితంగా లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్‌లు గైనకాలజిస్ట్‌ సలహా లేకుండానే జరిగాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 
 
మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ (ఐడీఎఫ్‌) ఈ సర్వేను నిర్వహించింది. లాక్‌డౌన్‌ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై ఈ సర్వే దృష్టి పెట్టింది. 
 
లాక్‌డౌన్‌ 1, 2 దశల్లో అంటే మార్చి 25 నుంచి మే 3 వరకు 59 శాతం మహిళలకు అబార్షన్‌ అంశంలో ఆస్పత్రికి వెళ్లడం, వైద్యులను కలవడం వంటి సదుపాయాలు లభించలేదని తెలిపింది. అన్‌లాక్‌ దశలో ఈ  పరిస్థితిలో మార్పు వచ్చిందని.. ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది. 
 
ఈ క్రమంలో ఐడీఎఫ్‌ సీఈఓ వినోజ్ మానింగ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిగా మారినందున వైద్య సిబ్బంది పూర్తి శ్రద్ధ, కృషి వైరస్ నియంత్రణ మీదనే ఉంది. ఫలితంగా మిగతా వైద్య సేవలు, ముఖ్యంగా సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది. మెజారిటీ ప్రజారోగ్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది కోవిడ్‌-19 చికిత్సలపై దృష్టి సారించారని చెప్పారు. 
 
ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో సురక్షితమైన గర్భస్రావానికి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేశారు. దాంతో సురక్షితమైన గర్భస్రావం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments