Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ కొండ కుప్పకూలిందంటే నమ్ముతారా.. ? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (10:13 IST)
hill
భారీ కొండ కుప్పకూలిందంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. తుఫానో.. భూకంపం వచ్చిందో తెలియదు కానీ భారీ కొండ కుప్పకూలిపోయింది. భారీ శబ్దాలకు సమీప ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌ పురం పంచాయతీ పరిధి దువ్వపాలెం క్వారీలో ఈ ఘటన జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు చేపట్టి, యంత్రాలతో తొలిచేయడంతోనే కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. 
 
కార్మికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. దువ్వపాలెం సర్వే నంబరు 100లో 80 ఎకరాల మేర కొండ ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా గ్రావెల్‌, రాయి తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే అనుమతికి మించి అక్రమంగా తవ్వకాలు చేపట్టడాన్ని గుర్తించిన గనుల శాఖ గత ఏడాది నాలుగు క్వారీలకు రూ.46 కోట్లు అపరాధ రుసుం విధించింది. 
 
అయినా అక్రమార్కులు పట్టించుకోలేదు. దీంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు కొండే కుప్పకూలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments