ఏపీ 'దిశ ఎఫెక్ట్‌'.. 7 నిమిషాల్లో అరెస్ట్‌

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (06:27 IST)
ఏపీలో దిశ సూపర్ ఎఫెక్ట్ చూపుతోంది. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ ద్వారా తొలి కేసు నమోదైంది.

ఆర్టీసీ బస్సులో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న మహిళ ఈ యాప్‌ను వినియోగించడంతో పోలీసులు ఆరు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకొని, ఆమెను వేధించిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా మొట్టమొదటి ఫిర్యాదు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నమోదైంది.

విజయవాడకు చెందిన ఓ ఉన్నతాధికారిణి ఆర్టీసీ గరుడ బస్సులో సోమవారం రాత్రి విశాఖపట్టణం నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కేలోతు బసవయ్య(43) ఆమె వెనుక సీటులో కూర్చున్నారు.

అర్ధరాత్రి దాటిన తరువాత బస్సులో అందరూ నిద్రపోతుండగా, బసవయ్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఎన్నిసార్లు విసుక్కున్నా, మరింత శృతిమించాడు.

ఆమె ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉండడంతో మంగళవారం తెల్లవారుజామున 4.21 గంటలకు ఆ యాప్‌లో బటన్‌ నొక్కారు. అప్పటికి ఆ బస్సు ఏలూరు మెయిన్‌ బైపా్‌సలో వెళుతోంది.

యాప్‌ నుంచి మంగళగిరిలోని కాల్‌సెంటర్‌కు సమాచారం చేరడంతో.. ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. దీంతో ఏలూరు డీఎస్పీ కిరణ్‌ ఆధ్వర్యంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలు ఆరు నిమిషాల్లోనే(4.27 గంటలకు) కలపర్రు టోల్‌గేటు వద్దకు చేరుకున్నాయి.

బసవయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 354, 354ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం

Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

తర్వాతి కథనం
Show comments