ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులతో పాటు ఆర్సీలను ఇకపై డిజిటల్ చేయనుంది. ఈ రెండింటిని ఇకపై డిజిటల్ రూపంలో జారీ చేస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో అవి పోస్టులో వారి వారి ఇళ్లకు పంపిస్తామని తెలిపింది.
ఇప్పటివరకు ఒక్కో కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్ కింద మరో రూ.25 తీసుకుని కార్డులను ప్రజల ఇళ్లకు పోస్టల్‌లో పంపించేది. అయితే కేంద్రం ప్రవేశ పెట్టిన వాహన్ పరివార్‌తో అనేక రాష్ట్రాలు ప్లాస్టిక్ కార్డుల స్థానంలో డిజిటల్ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి