Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కలవరపెడుతున్న అతిసార: ఇద్దరు మహిళలు మృతి

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (18:25 IST)
ఏపీలో అతిసార కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్‌ భయంతో జనం జడుసుకుంటుంటే అతిసారం ఏపీకి చుక్కలు చూపిస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలుషిత నీరు తాగడంతో చాలామంది అతిసారకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరులో అతిసార కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు.  యాగవల్లి అనే మహిళ తిరుపతి రూయా ఆసుపత్రిలో, సుగుణమ్మ చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. 
 
అంతేగాకుండా 15 రోజుల్లో 60 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురు, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అయితే, ఈ వ్యాధికి కారణం కలుషిత నీరేనని, అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఆశ, ఏఎన్ఎం, వాలంటీర్, డాక్టర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని గతంలోనే ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments