Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కొలిక్కివచ్చిన పీఆర్సీ - మరికొద్దిసేపట్లో సీఎం జగన్ ప్రకటన

ఏపీలో కొలిక్కివచ్చిన పీఆర్సీ - మరికొద్దిసేపట్లో సీఎం జగన్ ప్రకటన
, సోమవారం, 13 డిశెంబరు 2021 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో వేయి కళ్లతో ఎదురు చూస్తున్న పీఆర్సీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే ఉద్యోగులకు పీఆర్టీ ఎంత ఇవ్వాలన్న అంశంపై కమిటీ ఓ నివేదికను తయారుచేసింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో పాటు.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పీఆర్సీ అమలు సాధ్యమా లేదా అనే అంశంపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో పీఆర్సీపై సీఎం జగన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకటన సోమవారం సాయంత్రానికి వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా, పీఆర్సీ అమలు కోసం గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బార్‌ రహస్య గదిలో దాగిన అందమైన అమ్మాయిల అరెస్టు