Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల సీఎంలపై దేవినేని ఫైర్.. జగన్ గెలుపుకు కేసీఆర్?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (21:22 IST)
తెలుగు రాష్ట్రాల సీఎంలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గెలుపుకు కేసీఆర్ డబ్బు సమకూర్చారని అందుకే… తెలంగాణ ప్రభుత్వ తీరుపై జగన్‌ స్పందించడం లేదని దుయ్యబట్టారు.

రాష్ట్ర పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సీఎం జగన్ చంకనాకిస్తున్నాడని.. అధికారులు గుడ్డిగా జూరాల ప్రాజెక్ట్ వ్యవహారాన్ని గాలికి వదిలేసి కేఆర్ఎంబీ ఎదుట తలలూపుతుంటే, సీఎం, మంత్రులు గడ్డి పీకుతున్నారా..? అని ప్రశ్నించారు.
 
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలో చేర్చడానికి ఒప్పుకున్నవారు, జూరాలను ఎందుకు వదిలేశారు? జూరాలతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 17, 18 ఆఫ్ టెక్ లను కూడా సీఎం గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జూరాల దిగువన పక్క రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించి నీటిని తరలిస్తుంటే, 29 నెలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే జగన్ ఏం చేస్తున్నాడు? తక్షణమే సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments