Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో దంతవైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (12:18 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఓ దంత విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికంగా ఉండే నారాయణ డెంటల్ కాలేజీలో డెంటల్ కోర్సు చేస్తున్న ఈ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ విద్యార్థిని పేరు లాలస. ఈమె తన హాస్టల్‌ రూమ్‌లోఉరేసుకుని కనిపించింది. 
 
దీన్ని గమనించిన సహ విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునేలోపే ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన లాలస.. నెల్లూరులోని నారాయణ కాలేజీలో డెంటల్‌ చదువుతోంది. ఏమైందో ఏమో అర్థరాత్రి రెండు గంటల సమయంలో తాను ఉంటోన్న హాస్టల్‌ రూమ్‌లోనే ఫ్యాన్‌కి ఉరేసుకుంది. 
 
అయితే, లాలస మృతిపై పేరెంట్స్‌ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments