ఏపని చేయాలన్నా నెల్లూరు వారికి ఎవరూ సాటి రాలేరు. ఇక దసరా ఉత్సవాల నిర్వహణలోనూ అక్కడి వారు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. నెల్లూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇపుడు దసరా ఉత్సవాలు కనులు మిరుమిట్లు గొలిపేలా సాగుతున్నాయి. ఆలయాన్ని సందర్శించే భక్తులకు అమ్మవారు కళ్ళు జిగేల్ మనేలా కాంతివంతంగా దర్శనమిస్తున్నారు.
నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఐదు కోట్ల కరెన్సీ నోట్లతో, 7 కేజీల బంగారంతో , 60 కేజీల వెండితో అమ్మవారికి అలంకారం చేశారు. ఎక్కడ చూసినా కరెన్సీ నోట్ల కట్టలే. అమ్మదయ ఉంటే ఇవన్నీ వస్తాయన్నట్లు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అందుకే అమ్మవారిని అంత ఘనంగా అలంకరించామని చెపుతున్నారు. మొత్తం మీద అమ్మవారిని లక్ష్మి అవతారంలో దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.