Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దల హస్తం : చింతా మోహన్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:46 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అనేది ఒక స్కామే కాదని, దీన్ని బూచిగా చూపి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత సీఎం జగన్ పట్టరాని సంతోషంలో ఉన్నారన్నారు. అయితే, చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుందని, అప్పటివరకు ఆయన జైల్లో ఉండక తప్పదన్నది తన అభిప్రాయమని చింతా మోహన్ పేర్కొన్నారు. 
 
చంద్రబాబు ఖచ్చితంగా తప్పుచేసివుండరని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అసలు స్కామే కాదన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులుచేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పని చేయరన్నారు. చంద్రబాబును జైలుకు పంపించడం దారుణమన్నారు. ఏసీబీ కోర్టు తీర్పు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్లు సరిగా ఉండటం లేదని విమర్శించారు. 
 
చంద్రబాబుకు రిమాండ్ విధించిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ కేసు కోర్టులో నిలవదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వసతులు సరిగా లేవని, లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ నవ్వుతూ ఇంటికి వెళ్ళారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments