ప్రేమించాడు.. కానీ అనుమానం.. ప్రేయసిపై రిసార్ట్‌లో అత్యాచారం చేసి గొంతుకోశాడు..

ప్రేమించాడు.. ప్రేయసితో చనువుగా వున్నాడు. కానీ వేరొక వ్యక్తితో ప్రేయసి మాట్లాడుతుందని.. స్నేహంగా వుంటుందని తెలుసుకున్నాక జీర్ణించుకోలేకపోయాడు. అంతే రెసార్ట్‌లో కాటేజీ బుక్ చేసి.. ఆమెతో ఏకాంతంగా గడిపి.

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (11:02 IST)
ప్రేమించాడు.. ప్రేయసితో చనువుగా వున్నాడు. కానీ వేరొక వ్యక్తితో ప్రేయసి మాట్లాడుతుందని.. స్నేహంగా వుంటుందని తెలుసుకున్నాక జీర్ణించుకోలేకపోయాడు. అంతే రెసార్ట్‌లో కాటేజీ బుక్ చేసి.. ఆమెతో ఏకాంతంగా గడిపి.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో గురువారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్తూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (20) అనే డిగ్రీ విద్యార్థిని శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. వేరొక వ్యక్తితో స్నేహంగా వుంటోందని.. ఆమెతో గొడవకు దిగాడు.
 
ఇంకా శిరీషపై కోపం పెంచుకున్న సాయిప్రసాద్‌ పథకం ప్రకారం.. మాట్లాకుందాం రమ్మంటూ ఆమెను ప్రగతి రిసార్ట్‌కు పిలిచాడు. రిసార్ట్‌లో కాటేజీ బుక్‌ చేసుకొని ఏకాంతంగా గడిపినట్టు సమాచారం. ఆపై శిరీష గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఇలా ప్రేమ పేరుతో శిరీషపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత దారుణంగా కొంతు కోసి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 
 
హత్య విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన రిసార్ట్‌ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పాటు హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో వుండిన నిందితుడిని అరెస్టు చేశారు. సంఘటనపై మృతురాలి తండ్రి ఈశ్వర్‌ స్పందిస్తూ.. పెళ్లికాని వారిని రిసార్ట్‌లోకి ఎలా అనుమతిస్తారంటూ నిలదీశారు. రిసార్ట్స్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments