దేవుడు దగ్గర డిక్లరేషన్ ఎందుకు? ఎత్తేస్తే సరిపోతుంది..

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:37 IST)
కొడాలి నాని. ప్రస్తుతం ఈయన రాష్ట్రంలో హాట్ టాపిక్ లీడర్. తిరుమల లాంటి ధార్మిక క్షేత్రంలో అన్యమతస్తులు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు కొడాలి నాని. డిక్లరేషన్ పైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
 
దీనిపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్నో యేళ్ళుగా ఉన్న నిబంధనను ఎలా ఉల్లంఘిస్తారు.. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టే తిరుమల శ్రీవారి దర్సనార్థం వెళుతున్నారు.
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే వెళ్ళాలంటూ బిజెపి, టిడిపి, హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని వారి ఆగ్రహావేశాలు మరింతగా పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. అస్సలు డిక్లరేషన్ విధానాన్ని ఎత్తివేయాలని.. వివిధ కులాలు, మతాలకు చెందిన వారు తిరుమలకు వస్తుంటారు. 
 
అలాంటి ప్రాంతంలో అస్సలు ఈ డిక్లరేషన్ అవసరం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమంటూ కొడాలినాని వ్యాఖ్యానించారు. ఇది కాస్త ప్రస్తుతం హిందువుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇదిలావుంటే రేపు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో డిక్లరేషన్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments