Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

డిక్లరేషన్ పైన సంతకం చేసిన ఏకైక ప్రముఖుడు, అప్పుడు జగన్ తిరస్కరించారు

Advertiesment
Tirumala Declaration
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:29 IST)
అన్యమతస్థులు తిరుమలలో ప్రచారం చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో డిక్లరేషన్ విధానాని తీసుకువచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ డిక్లరేషన్ విధానం 1990 నుండి అమలులోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకూ డిక్లరేషన్ సంతకం చేసిన ఏకైక ప్రముఖులు దివంగత రైల్వే మంత్రి జాఫర్ షరిఫ్ ఒక్కరే.
 
1992లో శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సమయంలో డిక్లరేషన్ సమర్పించడంతో షరిప్ మతమార్పిడి చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే డిక్లరేషన్ సమర్పించని వారిలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, జైల్ సింగ్, వైయస్ఆర్ వంటి ప్రముఖులు కూడా వున్నారు. 
1999 జనవరిలో శ్రీవారిని దర్శించుకున్న సోనియా గాంధీ డిక్లరేషన్ సమర్పించలేదని భజరంగ్ దళ్, విహేచ్‌పి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
 
2003 నవంబర్ 20వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ దర్శనాంతరం విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీవారికి అర్చన జరిపించాలని మూడు అర్చన టిక్కేట్లు డబ్బును డాలర్ శేషాద్రికి అందజేసారు అబ్దుల్ కలాం. ఇక ఏపి ముఖ్యమంత్రి జగన్ 2009 లోనే శ్రీవారిని దర్శించుకున్నారు.
 
2012లో దర్శనానికి విచ్చేసిన సమయంలో మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలని టిటిడి ఉద్యోగులు జగన్‌ను కోరినా, స్వామి వారిని దర్శించడం తనకు ఇది మొదటిసారి కాదనీ, తన తండ్రి అనేకసార్లు స్వామివారిని దర్శించుకున్నారని, శ్రీవారికి పట్టువస్త్రాలను కూడా సమర్పించారని, డిక్లరేషన్ పైన సంతకం చేయడానికి జగన్ తిరస్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై హైవేపై పది అడుగుల కొండ చిలువ.. వీడియో వైరల్ (video)