Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా చోరీపై విచారణ మొదలుపెట్టిన బృందాలు..

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (15:42 IST)
ప్రస్తుత కాలంలో వస్తువులు, ఆభరణాలు, ఇతర పదార్థాలు చోరీకి గురవుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా డేటా చోరీ కూడా జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఐటీ గ్రిడ్స్ చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. 
 
కేసును అన్ని విధాల్లో విచారిస్తూ.. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు డేటా చోరీకి కారణంగా ఉన్న సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు డేటా యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సిట్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 
 
సైబర్ క్రైమ్ పోలీసులతో ఓ బృందం.. కేసుకు సంబంధించిన సైబర్ నిపుణుల సలహాలతో డేటా అనాలసిస్, డేటా రిట్రైవ్ చేపట్టనుంది. ఈ డేటా చోరీకి సంబంధించి సాక్షులను, నిందితులను విచారించడానికి సీనియర్ అధికారితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరుపనుంది.
 
మిగిలిన రెండు బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ ఆశోక్ కోసం గాలింపు చేపట్టనున్నాయి. అంతేకాదు.. కేసుకు సంబంధించిన యూజర్ల సమాచారం ఇవ్వాల్సిందేనని అమెజాన్ గూగుల్‌ని కోరింది. డేటా చోరికి సంబంధించిన వివరాలను యూఐడీఎఐ.. ఎన్నికల కమీషన్‌లకు లేఖ ద్వారా సిట్ సమాచారం అందజేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments