Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:36 IST)
బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ... సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా పని చేస్తుండగా... ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని చెప్పారు. పోరంకి, పెనమలూరులో ఉంటారని తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని... మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్య క్రియలు చేశారని ఆయన చెప్పారు.
 
కంచికచెర్లలో ఇద్దరు వృద్ధ దంపతులను ఇలాగే హత్య చేశారన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో ఆరుగురిని హత్య చేసినట్లు తెలిపారు. 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని... సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేశామని తెలిపారు. కంచికచర్ల కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయన్నారు. వీళ్ళు చేసిన నేరాలలో హత్య జరిగినట్టు బాధితులకే తెలీకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చారు. ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే టార్గెట్ చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments