Publish Date: Thu, 24 Jun 2021 (23:19 IST)
Updated Date: Thu, 24 Jun 2021 (23:20 IST)
అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు దారుణ హత్యలకు గురవడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశాంత పల్లెల్ని కూడా ముఠాకక్షల కేంద్రాల్ని చేసిన ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి గారూ! మీ కక్షపూరిత పాలనలో ఇంకెంతమంది టీడీపీ కార్యకర్తల్ని బలి తీసుకుంటారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్త లక్కెపోగు సుబ్బారావుని వైసీపీ మూకలు హత్య చేయడం అత్యంత దారుణమన్నారు. ఇంట్లో శుభకార్యానికి డీజే పెట్టుకుంటే, ఓర్వలేని వైసీపీ వర్గీయులు దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే, ఎంతగా బరితెగించారో అర్థం అవుతోందన్నారు. సుబ్బారావు కుటుంబానికి, గాయపడిన టీడీపీ కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు.