Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి: సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి: సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ
, గురువారం, 13 మే 2021 (19:35 IST)
పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. మరో 3 వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరినీ పాస్ చేయండి. 
 
పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలోమరో 12 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయి. పలుమార్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన ఆన్లైన్ సమావేశాల్లో కోవిడ్ భయానికి తోడు పరీక్షల పట్ల ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో నా దృష్టికి తీసుకొచ్చారు. 
 
కోవిడ్ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితుల్ని మన భవిష్యత్తు తరం చూడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 5వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. 
 
రాష్ట్రంలో ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. వేలాది కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదకరం. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృధా చేయొద్దు. 
 
పరీక్షలు నిర్వహించరాదనే విద్యార్థుల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి పరీక్షల రద్దు నిర్ణయం ప్రకటించాలి. విద్యార్థులను పాస్ చెయ్యాలి. హైకోర్టు లేదా ప్రతిపక్ష నాయకులు ఆందోళనలతో కాకుండా మానవత్వంతో ఆలోచించి వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించండి అని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనాధ శవాలకు అన్నీతానై తిరుపతి ఎమ్మెల్యే అంత్యక్రియలు