Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూమన

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూమన
, గురువారం, 24 జూన్ 2021 (23:09 IST)
తిరుపతి నగరంలోని పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

గురువారం ఉదయం స్థానిక నరసింహ తీర్థం రోడ్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం భూమి పూజకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా,  ఉప మేయర్ ముద్ర నారాయణ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమి పూజ చేశారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర పరిధిలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించనున్నారన్నారు.  ఇందులో భాగంగా నరసింహ తీర్థం రోడ్డులో 80 లక్షలు రూపాయల నిధులు వెచ్చించి వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించనున్నామన్నారు.

ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా  పేద ప్రజలకు అన్ని మౌళిక వసతులతో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అందిస్తున్నామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వైద్య పరికరాలను ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  సకాలంలో పనులు పూర్తి ప్రజలకు అందుబాటులోనికి తెస్తామన్నారు.
 
ఈ  కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంకటేష్, ఆదిలక్ష్మి, కల్పన, రేవతి, నరేంద్ర, కో ఆప్షన్ సభ్యుడు ఇమామ్, గాంధీ భవన్ ట్రస్ట్ చైర్మన్, మొదలియార్ సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డి.ఈ. రవీంద్రారెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, నగరపాలక సంస్థ సిబ్బంది, తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి.