Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రుల్లో కొందరు అడవిపందుల్లా అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు: దేవినేని

మంత్రుల్లో కొందరు అడవిపందుల్లా అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు:  దేవినేని
, బుధవారం, 23 జూన్ 2021 (22:53 IST)
ప్రకాశం బ్యారేజీ దిగువన, సీతానగరం పుష్కరఘాట్ లో నర్సింగ్ చదువుతున్న యువతిపై, కాబోయేభర్త పక్కనుం డగానే కొన్ని అరాచకశక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టా యని, ఘటనాస్థలం ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనేఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం... ! 

అదిజరిగి రెండ్రోజులుకాకమునుపే 22 వతేదీన మైలవరం నియోజకవర్గంలోని తోలుకూడు గ్రామంలో మల్లాది నాగేం ద్రమ్మ అనే 45ఏళ్ల ఎస్సీమహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టి అతిదారుణంగా కిరాతకంగా  హత్యచేశారు. ఏదో కార్యక్రమం ఉందనిచెప్పి, అడిషనల్ మహిళా ఎస్పీ నేడు మైలవరం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కానీ స్థానిక పోలీసులెవరూ ఆమెను ఘటనాస్థలానికి తీసుకెళ్లి చూపించలేదు. సంఘటన జరిగిందనే సమాచారం కూడా ఎక్కడా మీడియాకు తెలియనివ్వలేదు. 

మైలవరం నుంచి తనకు సమాచారం అందిన వెంటనే స్థానికపోలీసులను అడిగితే, ఒకమహిళ కిందపడి చనిపోయిందని చెప్పారు. నేనువెంటనే మహిళ హత్యకావింపబడిన గ్రామానికి వెళ్లి మాట్లాడాను.  చనిపోయిన మహిళమృతదేహాన్ని, ఒంటిపై ఉన్న గాయాలను పరిశీలించాను. మల్లాది మరియమ్మకు భర్తలేడు. ఆమెకూతురు 5వతరగతి చదువుతోంది. గ్రామం లోని ఎస్సీకాలనీలోని మహిళలంతా భయంతో వణికిపోతున్నారు.

మహిళపై అఘాయిత్యానికిపాల్పడి, చేతిలో కొడవ లి పెట్టి, చీరచుట్టారని నాతోచెప్పి వాపోయారు. కానీ జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులకు అది అనుమానాస్పద మృతిలా కనిపించలేదట? గ్రామంలోని ప్రతిమహిళా నాగేంద్రమ్మ హత్యచేయబడిదనిచెబుతుంటే, చట్టాన్ని ఉద్ధరి స్తున్నఏపీపోలీసులకు మాత్రం ఆమెమరణం హత్యలా కని పించలా. ఒకఎస్సీ మహిళపై ఇలాజరిగితే వాస్తవానికి ముఖ్యమంత్రి మనసు కలిచివేయాలి.

కానీ ఆచరణలో మాత్రం ఆయన మహిళలకు, ధైర్యాన్ని,భరోసాని ఇవ్వలేక పోతున్నాడు. మంత్రుల్లో కొందరు అడవిపందుల్లా , అచ్చోసి నఆంబోతుల్లా మాట్లాడుతున్నారు. కొంతమంది వాడుతున్న భాషచూసే, సమాజంలో అరాచకశక్తులు పేట్రేగి పోతున్నాయి. బాధ్యతగలపదవుల్లోఉండి మంత్రులే బూతు లుమాట్లాడుతుంటే, రాష్ట్రంలోని అరాచకశక్తులు మనమేం చేసినామనల్ని కాపాడుతారులే అనే చెలరేగిపోతున్నాయి.

సంఘవిద్రోహ, అరాచకశక్తులకు ధైర్యంరావడానికి, మహిళల పై అఘాయిత్యాలకు ఒడిగట్టడానికి మంత్రులవ్యాఖ్యలే కార ణం. ఎస్సీమహిళపై జరిగిన దాడిఘటనపై దిశాయాప్ లు, దిశా పోలీస్ స్టేషన్లుఏమయ్యాయి? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే తప్పుడుకేసులుకడుతుంటే, రాష్ట్రంలో మహిళల కు భద్రతఉందా?

మహిళాహోంమంత్రి, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ తక్షణమే నాగేంద్రమ్మ మృతికి గురైన గ్రామానికి వెళ్లాలి. అక్కడేంజరిగిందో, పోలీసులు ఏం చెబుతున్నారో గ్రహించాలి. మృతిచెందిన పేదఎస్సీమహిళకుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థికసాయం ప్రకటించాలి. మహిళపై అత్యాచారానికి పాల్పడి, హతమార్చినవారిని దారుణంగా శి క్షించాలి. 
రాష్ట్రంలో ఏంజరుగుతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకురారు.

కరోనాతో ప్రజలు చనిపోతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, ఆయనకుపట్ట డంలేదు. ఏదో మొక్కుబడిగా మనసు కలిచివేసిందంటే సరి పోతుందా? గ్రామాల్లో బోర్లు ప్రారంభించాలన్నా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ముందుంటాడు. మహిళను హతమార్చి 24గంటలు దాటిపోయినా, ఆయనఇంతవరకు స్పందించలేదు.

బూతులు మాట్లాడే జిల్లామంత్రులకు అసలే తీరికలేదు. స్థానికపోలీసులేమో మహిళకిందపడి చనిపో యిందని చెబుతారు. కిందిస్థాయిలో పోలీసుల పనితీరుఎలా ఉందో డీజీపీ అర్థంచేసుకోవాలి. ముఖ్యమంత్రికే బాధ్యతలేక పోతే, అధికారులకుఉంటుందా? ముఖ్యమంత్రి బయటకు రాలేనిస్థితిలోఉంటే, బయటేమో అసాంఘిక, అరాచకశక్తులు పేట్రిగిపోతున్నాయి. రాష్ట్రంలో తప్పుచేసేవాళ్లకు కనీసం ఎక్కడా భయమనేది కనిపించడంలేదు.

ఎంతదుర్మార్గంగా మహిళలను చెరబట్టి,హతమారుస్తున్నారో పరిస్థితులే చెబు తున్నాయి.  మైలవరంలో ఎస్సీమహిళ ఎలా చనిపోయిం దో చెప్పారనిచెప్పి, కొందరు న్యాయవాదులైన మహిళలపై నోరుపారేసుకున్నారు. ఇష్టమొచ్చినట్టు వారిని దూషించారు .ఎస్సీ మహిళను చంపినవారిని కఠినంగా శిక్షించి, ముఖ్య మంత్రి తనచిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

దిశ యాప్ లు ఏమయ్యాయో, దిశ పోలీస్ స్టేషన్లుఏంచేస్తున్నాయో కూడా ముఖ్యమంత్రి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినదిశాచట్టం ఎక్కడ అమలవుతోంది? అసాంఘికశక్తులకుఊతమిచ్చేలా ముఖ్యమంత్రే మంత్రులతో బూతులుమాట్లాడిస్తున్నాడు. ప్రతిపక్షనేతను బూతులుతిడితే ముఖ్యమంత్రి ఆనందిస్తు న్నాడు. ఎస్సీ మహిళను దారుణంగా హతమార్చాక అక్కడున్నఎస్సీ మహిళలంతా తమపరిస్థితేమిటని భయంతో వణికిపోతున్నారు.

జరిగిన ఘటనపై వాస్తవాలను పరిగ ణనలోకి తీసుకోకుండా, జరిగినదాన్ని కప్పిపుచ్చి ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులపై కూడా ప్రభుత్వం వెంటనేచర్యలు తీసుకోవాలి.  పొందుగలగ్రామంలో గతంలో ఎన్నికలసమయంలో ఒకఎస్టీమహిళను అకారణంగా కొట్టారు. ఆనాడు అక్కడ ఆపనిచేసిన పోలీసులే, ఇప్పుడు ఇక్కడఎస్సీమహిళ హత్యగావింపబడిన ఘటనను నీరుగార్చాలని చూస్తున్నారు.

ఎస్సీ మహిళ దారుణంగా చంపబడితే ఐఎస్ వో ఫంక్షన్లపేరుతో పోలీస్ స్టేషన్లలో హడా వుడిచేస్తారా? ఇదేనా పోలీసులుపనితీరు? ఇదేనా వారు ప్రజలకుఇచ్చే సందేశం? ముఖ్యమంత్రే దీనిపై స్వయంగా సమాధానంచెప్పాలి. హోంమంత్రి, స్థానికఎమ్మెల్యే జరిగిన ఘటనపై ఎందుకు మాట్లాడరు?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24వ తేదీన విజయవాడలో కోవిషీల్డ్ వ్యాక్సినేష‌న్