Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాల్ట్ ప్రాజెక్టుకు రూ.1,860 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం: మంత్రి ఆదిమూలపు సురేష్

సాల్ట్ ప్రాజెక్టుకు రూ.1,860 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం: మంత్రి ఆదిమూలపు సురేష్
, బుధవారం, 23 జూన్ 2021 (22:37 IST)
అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు, ఆంధ్ర అభ్యాసన పరివర్తన కార్యక్రమానికి నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1,860 కోట్లు) ఆర్థిక సహాయం అందుతుందన్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కి, జునైద్ కమల్ అహ్మద్ (కంట్రీ డైరెక్టర్, ఇండియా) (ప్రపంచ బ్యాంకు) నుండి లేఖ అందింది. నాడు నేడులో భాగంగా మౌలిక సౌకర్యాల రూపకల్పన, నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం తన నిబద్ధతను పునరుద్ఘాటించి  లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉంది. ముఖ్యంగా పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణంలోనూ, పారిశుధ్య కార్మికుల నియామకం, శిక్షణకు ప్రధమ ప్రాధాన్యతనిస్తుంది.

మొదటి దశ నాడు- నేడు పనులు జరిగిన తీరుతో సంతృప్తి చెందటంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న అనేక పధకాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఈ పధకం బృందం ప్రతిపాదనతో ప్రపంచ బ్యాంకు రుణాన్ని మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. 
 
ఆంధ్రా అభ్యాసనా పరివర్తన సహాయక సన్నాహక పధకం...
ఈ ప్రాజెక్ట్‌లోని కీలక అంశాలు: పునాది అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను నాణ్యతను మెరుగుపరచటం,  నాణ్యమైన సేవలను అందించుటకు సంస్థాగత సామర్థ్యములను, సామాజిక  సంస్థల ప్రేమేయాన్ని బలోపేతం చేయడం. 

ప్రాజెక్ట్ వ్యవధి : ప్రాజెక్ట్ 2021-22 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరాలు (లేదా 5 సంవత్సరాలకాల పరిమితి కలిగి వుంటుంది). ప్రపంచ బ్యాంకు నుండి  ఆంద్ర రాష్ట్రం 1,860.,కోట్ల,ఆర్థిక సహాయం (రుణం) అందుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటీ కేంద్రంగా విశాఖ...