Webdunia - Bharat's app for daily news and videos

Install App

దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (17:03 IST)
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకచిహ్నంగా మారుస్తామని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్మారక చిహ్నం కోసం రూ.కోటితో నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
 
దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని తెలిపారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. దామోదరం సంజీవయ్య సేవలకు గుర్తుగా చిహ్నం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆ ఇంటి ఫొటోలను పవన్‌ పోస్ట్‌ చేశారు. సంజీవయ్య అత్యంత పేదరికంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు బీజాలు వేశారని.. సీఎంగా రెండేళ్లే ఉన్నా ఎన్నో పనులు చేశారని చెప్పారు. 
 
హైదరాబాద్‌ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యేనని చెప్పారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని పవన్‌ గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments