Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీమ్లా నాయక్ ప్రోమో లోడింగ్: అంత ఇష్టం పాట కూడా రెడీ

Advertiesment
భీమ్లా నాయక్ ప్రోమో లోడింగ్: అంత ఇష్టం పాట కూడా రెడీ
, బుధవారం, 13 అక్టోబరు 2021 (18:43 IST)
Bheemla nayak
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి మ్యూజిక్ కూడా పెద్ద హిట్‌గా మారినట్టు ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ చెబుతుంది.. పవన్‌పై డిజైన్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్‌తో ఇప్పటికీ అదే హవా కొనసాగిస్తుంది.
 
ఇక మళ్లీ ఆలస్యం చెయ్యకుండా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో పాటను కూడా రెడీ చేసేయగా ఇప్పుడు దీని ప్రోమోకి సంబంధించిన అన్ని పనులు ముగిసినట్లేనని తెలుస్తోంది. 
 
ఆల్రెడీ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను త్రివిక్రమ్‌కి వినిపించగా మరో పెద్ద హిట్ అవుతుంది అని వారు తెలిపారని శాస్త్రి ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. సంగీత దర్శకుడు థమన్ కూడా దీనిపై ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. అయితే ఈ ప్రోమో ఈరోజు కానీ రేపు కానీ విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌మ‌న్వ‌య లోపంతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలా మాట్లాడారుః బ‌న్నీవాసు