Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనిస్ తుఫానుతో వణికిపోతున్న యూరప్.. మనుషులే ఎగిరిపోతున్నారు

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (12:42 IST)
యూరప్ దేశాలు యూనిస్ తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా ఆస్తి నష్టం ఏర్పడింది. భీకరగాలులతో యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. 
 
శుక్రవారం కొన్నిచోట్ల గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ గాలులకు మనుషులే ఎగిరిపోతున్నారు. 
 
ఇక విమానాలు, రైళ్లు, ఫెర్రీల రాకపోకలకు అంతరాయం కలుగుతుంటే... పశ్చిమ యూరప్‌లో లక్షల మంది ప్రయాణికులు తాత్కాలిక షెల్టర్లలో ఉండాల్సి వస్తోంది. 
 
అట్లాంటిక్ మహా సముద్రంపై ఈ తుఫాను పుట్టింది. ఇది వాయవ్య యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. నిన్న ఒక్క రోజే 8 మంది చనిపోయారు. 
 
ఈసారి వచ్చిన యూనిస్ తుఫాను అత్యంత భయంకరమైనది, ప్రాణాంతకమైనదని బ్రిటన్ లోని వాతావరణ ఆఫీస్ తెలిపింది. ఈ తుఫాను వల్ల విమానాలు సైతం రన్‌వేపై ఊగిపోతున్నాయి. 
 
బ్రిటన్ ఎయిర్ పోర్టుల్లో విమానాలు దిగకుండా దారిమళ్లిస్తున్నారు. లండన్‌లోని హీత్రో ఎయిర్ పోర్టులో ఏకంగా లైవ్ స్ట్రీమ్ పెట్టేశారు. దాన్ని 2 లక్షల మందికి పైగా చూస్తున్నారు. బ్రిటన్ లో 436 విమానాల సర్వీసులను రద్దు చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments