Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం లేక అన్నం వండలేదని చెప్పింది.. అంతే కాళ్లు, చేతులు కోసేశాడు..

Webdunia
సోమవారం, 22 జులై 2019 (10:37 IST)
భోజనం పెట్టమంటే అన్నం వండలేదని చెప్పిందని చాకుతో భార్య కాళ్లు, చేతులు కోసేశాడు ఓ దుర్మార్గపు భర్త. ఈ ఘటన విజయవాడ చిట్టినగర్ ప్రాంతం గొల్లపాలెంగట్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన అన్నపురెడ్డి జగదీష్‌రెడ్డి, హాసినికి ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. 
 
వీరికి ఇద్దరు పిల్లలు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగదీష్‌ సంపాదన అంతా సొంత ఖర్చుకే తగలేసుకుంటాడు. బలాదూర్‌గా తిరుగుతాడు. ఇంటి ఖర్చుకు డబ్బు ఇచ్చేవాడు కాదు. ఈ వ్యవహారంలో తరచూ దంపతుల మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. 
 
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చిన జగదీష్‌ భోజనం పెట్టమని భార్యను కోరాడు. బియ్యం లేక వంట చేయలేదని భర్తకు చెప్పడంతో.. చేతికి దొరికిన చాకుతో భార్య చేతులు, కాళ్లు మీద విచక్షణా రహితంగా కోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments