Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్‌కు విజ్ఞప్తి... ఆశా వర్కర్ల జిల్లా ధర్నా.. విషయం ఏంటంటే?

సీఎం జగన్‌కు విజ్ఞప్తి...  ఆశా వర్కర్ల జిల్లా ధర్నా.. విషయం ఏంటంటే?
, సోమవారం, 15 జులై 2019 (19:40 IST)
ఆశాలకు 6 నెలలుగా బకాయి పడిన వేతనాలు, పారితోషికాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు పారితోషికాలతో ముడి పెట్టకుండా గౌరవ వేతనంగానే ఇవ్వాలని, జీ.ఓ.వెంటనే విడుదల చేయాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని తదితర డిమాండ్లపై జరిగిన ధర్నాలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆశాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆశా వర్కర్ల యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు వై.నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ధనశ్రీ, ప్రధాన కార్యదర్శి ఎం.కమల, సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్.బాబూరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.సిహెచ్.శ్రీనివాస్, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం సంఘాలు జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యుత్‌, పీపీఏలను పునః సమీక్షిస్తాం..ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం