పట్టాలు ఎక్కనున్న బెంగళూరు-విజయవాడ ప్యాసింజరు

మంగళవారం, 16 జులై 2019 (08:53 IST)
డబుల్‌ లైన్‌ పనుల్లో భాగంగా రెండు నెలలుగా రద్దులో ఉన్న బెంగళూరు-విజయవాడ(56503) ప్యాసింజర్‌, విజయవాడ-బెంగళూరు (56504) ప్యాసింజరు మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనున్నట్లు అనంతపురం స్టేషన్‌ మేనేజర్‌ థావూనాయక్‌ తెలిపారు. 
 
రెండు నెలలుగా ఈ రైలు లేకపోవడంతో ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా మారింది. అలాంటిది మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనుండడంతో కొంత ఉపశమనం కలగనుంది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే(56503) ప్యాసింజర్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం స్టేషన్‌కు రానుంది. 
 
అలాగే విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్యాసింజర్‌ (56504)ఉదయం 10.50 గంటలకు అనంతపురం స్టేషన్‌కు రానుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బీజేపీ వైపు వైసీపీ మహిళా నేత చూపు