Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల డ్రామా భలే రంజుగా ఉంది : కె.నారాయణ

Webdunia
సోమవారం, 5 జులై 2021 (08:09 IST)
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న కృష్ణా జలాల డ్రామా భలే రంజుగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ సమస్య వచ్చినా దానిని కృష్ణా జలాలతో ముడిపెడుతున్నారని విమర్శించారు. 
 
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ ఎవరికి వారే ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
 
కృష్ణా జలాల వినియోగంపై ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ట్రైబ్యునల్‌ను కేసీఆర్ ప్రశ్నిస్తే.. జగన్‌మోహన్‌ రెడ్డి కోర్టులు, ఎన్నికల కమిషన్లను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు. 
 
ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పోలీసుల మోహరింపును చూస్తుంటే భారత్ - చైనా దేశాల సరిహద్దులు గుర్తొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ఇరు రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments