Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

వరుణ్
బుధవారం, 3 జులై 2024 (10:44 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలను సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ వివరించారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని, అది లేకపోవడం వల్లే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామని, లేకపోతే లేమని జగన్ స్పష్టంగా చెప్పలేకపోయారన్నారు. ఆయన తటస్థ స్టాండ్ తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 
 
అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని, అంతే తప్ప ఓట్ల శాతం ఆధారంగా కాదని గుర్తు చేశారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లే వైసీపీ 11 స్థానాలకు పరిమితమైందన్నారు. ఇక న్యూట్రల్ స్టాండ్ వల్ల జగన్ మాత్రమే కాదని కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా తీవ్రంగా నష్టపోయారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీతో కలిసి వెళ్లాలనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం వాళ్ల వరకూ కరెక్టేనని నారాయణ అన్నారు. 
 
కాగా, టీడీపీ కూటమిలో పవన్ డైనమిక్ పాత్ర పోషించారన్నారు. ఆయనకు ఉన్న సినిమా చరిష్మా ఎన్నికల్లో ప్లస్ అయిందన్నారు. అందుకే పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన గెలిచిందని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించామని చెప్పిన ఆయన.. జగన్ హయాంలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న రుషికొండ భవనాల నిర్మాణంపై కూడా నారాయణ స్పందించారు. ఈ భవనాలను నిర్మించేటప్పుడు ప్రతిపక్ష నేతలను వైసీపీ ప్రభుత్వం అక్కడకు వెళ్లనీయలేదన్నారు. ఈ భవనాల్ని కూటమి ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలని నారాయణ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments