Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే మీకొచ్చిన నష్టమేంటి? : సీపీఐ నారాయణ

narayana
, బుధవారం, 26 జులై 2023 (16:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడి జగన్మోహన్ రెడ్డితో వైకాపా మంత్రులు, నేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ వైకాపా నేతలు పదేపదే చేయడంపై ఆయన మండిపడ్డారు. పదేపదే పవన్ మూడు పెళ్ళిళ్ల గురించి మాట్లాడుతున్నారని, పవన్ విడాకులు తీసుకుని మూడు వివాహాలు చేసుకున్నారని, దీనివల్ల సీఎం జగన్‌కువ వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. 
 
మూడు పెళ్లిళ్ళు తప్పా? లేకా బాబాయ్‌ను హత్య చేయడం తప్పా? అని ప్రశ్నించారు. బాబాయ్‌ని చంపడం తప్పుకాదు అని జగన్ చెబుతారా? అని ఆయన నిలదీశారు. జగన్ తన సీఎం హోదాను మరిచిపోయి అత్యంత హీనస్థితికి దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజకీయంగా ఎన్ని రకాలుగానైనా విమర్శలు చేయొచ్చని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం భావ్యం కాదన్నారు. పవన్‌ను రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేకపోవడం, గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు ఏం లేకపోవడంతో ఈ తరహా దిగజారుడు విమర్శలు చేస్తున్నారని సీపీఐ నారాయణ అన్నారు. 
 
రోకలిబండతో మోది చెల్లెలి హత్య ... ఎక్కడ?
 
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఓ దారుణం జరిగింది. పొద్దస్తమానం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుందని ఆగ్రహించిన ఓ సోదరుడు.. సొంత చెల్లిని రోకలి బండతో మోది చంపేశాడు. ఆ తర్వాత రాయి తగలడంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులు పిలవడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇల్లెందు మండలంలోని రాజీవ్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇది సోదరుడికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో చెల్లితో తరచూ గొడవపడుతున్నాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 
 
ఈ క్రమంలో హరిలాల్ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్తుండగా మృతిచెందారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే హరిలాల్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర మంత్రి షెకావత్ ఎందుకు తప్పుబట్టారు? కుళాయి నీళ్ల పథకం అమలులో ఏపీ ఎక్కడుంది?