Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలంతా బ్రో అంటున్నారు- ఆరునెలలు రెస్ట్‌ నిజమే : సాయిధరమ్‌ తేజ్‌

Advertiesment
Saitej latest
, బుధవారం, 26 జులై 2023 (15:31 IST)
Saitej latest
కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ను ఇప్పుడంతా బ్రో అని పిలుస్తున్నారు. అబ్బాయిలు అయితే పర్వాలేదు. అమ్మాయిలుకూడా పిలుస్తున్నారంటూ సరదా కామెంట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌తో బ్రో సినిమా చేశాడు. దీనిపై ఆయన వివరణిస్తూ, నాకు బైక్‌ యాక్సిడెంట్‌ అయ్యాక కోమాలోకి వెళ్ళి మరో జన్మ ఎత్తాను. ఆ తర్వాత నుంచి నాకు అంతకుముందు పరిచయం వున్న అమ్మాయిలంతా బ్రో అని పిలవడం నాకే ఆశ్చర్యం కలిగింది.
 
సో.. ఇదేనేమో విధి అంటే. అనుకోకుండా అలాంటి కథతో బ్రో సినిమా చేశాను. నా కోసమే ఈ కథ వచ్చినట్లుంది అని సాయితేజ్‌ తెలిపారు. ఈమధ్యనే విరూపాక్ష తర్వాత హిట్‌ వచ్చాక అంతాబాగుందని అనుకున్నాను. అయితే బ్రో సినిమా చేయడంతో బ్రో అని అంతా పిలుస్తున్నారు. ఇంట్లో కూడా అంతా నన్ను ఆటపట్టిస్తున్నారు.
 
ఇక్కడే విషయం మీకు చెప్పాలి. నేను బ్రో సినిమా తర్వాత 6నెలలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అది నిజమే. నేను ఇంకా ఆరోగ్యపరంగా సెట్‌ కావాలి. అందుకే ఆరు నెలలు రెస్ట్‌ తీసుకోవాలి. అంటూ క్లారిటీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజా, రమ్య కృష్ణన్ కలిశారు.. ఫోటోలు వైరల్