Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున కేసు పెడతానని బెదిరించారు.. సీపీఐ నారాయణ

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (12:08 IST)
తెలుగు అగ్ర హీరో నాగార్జున అంటే తనకు ఇష్టమేనని అయితే, తనపై కేసు పెడతానని బెదిరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. అయితే, ఆయన బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదన్నారు. ఎందుకంటే అది తన దృష్టిలో ఒక బ్రోతల్ హౌస్ అని చెప్పారు. అందుకే తనపై కేసు పెడతానని బెదిరించారని చెప్పారు. 
 
తాజాగా ఆయన ఓ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన మనస్సులోని విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్‌లో ముగ్గురు అమ్మాయిలను పిలిచి ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు. ఏ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావు అంటూ అడుగుతారని, ఆడ పిల్లలను ఇలా మాట్లాడటం సబబేనా అని ప్రశ్నించారు. 
 
అందుకే బిగ్ బాస్ హౌస్ అనేది తన దృష్టిలో బ్రోతల్ హౌస్ అని అన్నారు. ఈ మాట అన్నందుకే నాగార్జున తనపై కేసు పెడతానని హెచ్చరించారని తెలిపారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీని వ్యతిరేకించే బలమైన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరుగా ఉన్నట్టు ప్రజలను నమ్మిస్తారని, నిజానికి ప్రధాని మోడీకి అత్యంత నమ్మకస్తుల్లో సీఎం కేసీఆర్ ఒకరు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments