కోర్టు పరిధిలోకి ఏపీ రాజధాని అంశం: కేంద్రం

Webdunia
బుధవారం, 14 జులై 2021 (07:42 IST)
ఏపీ రాజధానిపై కేంద్రం మాట మార్చింది. గతంలో ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్‌రెడ్డికి సమాధానమిచ్చింది.

కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ రాజధానిపై తప్పును కేంద్రం సరిదిద్దుకుంది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ మరో లేఖను కేంద్ర హోంశాఖ పంపింది. 
 
కాగా ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. అటు రాజధాని రైతులు కూడా నిరసనను కొనసాగిస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఒకే రాజధానికి జై కొట్టాయి. అయితే అటు కేంద్రం మాత్రం రాజధాని నిర్ణయం స్థానిక ప్రభుత్వానిదేనని పదే పదే చెప్పింది.

తాజాగా కోర్టు పరిధిలో ఉందని అంటోంది. దీంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామం కూడా ఇందుకు నిదర్శనమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments