Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ఏనుగు బీభత్సం.. దంపతుల మృతి.. యువకుడి పరిస్థితి విషమం

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (15:56 IST)
చిత్తూరులో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు జనవాసానికి రావడంతో ప్రజలు పరుగులు తీశారు. అయితే ఏనుగు తొక్కడంతో చిత్తూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. 
 
గుడిపాల మండలం రామాపురం హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామాపురంలో పొలంలో పనిచేస్తున్న దంపతులపై దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏనుగుల గుంపు నుంచి విడిపోయి గ్రామ సమీపంలోని పొలాలపై పడింది. రామాపురంలో పొలంలో పనిచేస్తున్న వెంకటేశ్, సెల్వి దంపతులపై ఏనుగు దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు.
 
ఆ తర్వాత సీకే పల్లెలో మామిడి తోటలో కార్తీక్ అనే యువకుడి​పై ఏనుగు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇంకా ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments