జ్యోతిష్య పండితులారా తప్పును సరిదిద్దుకోండి: 12 రాశుల్లో తిరిగేది భూమి.. సూర్యుడు కాదు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:41 IST)
పంచాంగంలో  సూచించినట్లు 12 రాశుల్లో తిరిగేది భూమి అని, సూర్యుడు కాదని ప్రముఖ జ్యోతిష్య విద్యా రత్న నందిపాటి మధుసూదన రావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఐలాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అందరూ చెబుతున్న రాశి చక్రంలో రవి 12 రాశుల్లో తిరుగుతున్నట్లు చూపిస్తున్నారని, అది శుద్ద తప్పని 12 రాశుల్లో తిరిగేది భూమి అని అన్నారు. ఇలా బోధించడం వలన భావి తరాల విద్యార్థులు ఎటువంటి గందరగోళం లేకుండా విషయాన్ని గ్రహిస్తారని అన్నారు.

భూమి స్థానంలో రవి తిరుగుతున్నాడని గత కొద్ది శతాబ్దాలుగా ఈ తప్పును కొనసాగిస్తున్నారని అని అన్నారు. అది ఎక్కడో జరిగిన తప్పును కొనసాగించడం మంచి కాదని ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

దానికి సంబంధించిన గ్రంథాలు ప్రాచీన నలంద విశ్వ విద్యాలయంలో ఉండవచ్చని అవి విదేశీ దండయాత్రల్లో కాల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాటి తాలుకా నకళ్ళు ఏవరి వద్దనైనా  ఉంటే అందచేయవలసిందిగా కోరారు. అందుకు తగిన పారితోషికం ఇస్తానని చెప్పారు.

పాశ్చాత్య దేశాలు కూడా మన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగానే సండే, మండే, ట్యూస్ డే, వెన్స్ డే అని వారాల పేర్లు పొందుపరిచారని అన్నారు. ఏమైనా సందేహలు ఉంటే 7386678714 సెల్ నంబర్ కు సంప్రదించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments